27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

 

భిక్కనూరు, బతుకమ్మ :

 

భిక్కనూరు మండలంలోని రామేశ్వర్ పల్లి, తిప్పాపూర్ గ్రామాల్లో లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి శనివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ఇంద్రకరణ్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీమ్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. అనారోగ్యంతో  ఇబ్బందులు పడుతున్న ఆరు కుటుంబాలకు చెక్కులను నేరుగా వారి ఇళ్ల వద్దకే వెళ్లి అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి లింగాల రాజబాబు గౌడ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్, స్థానిక సర్పంచులు లింగారెడ్డి, రాణి రాజు, ఉప సర్పంచులు జీవన్, వినోద్ గౌడ్ ఇతర వార్డు సభ్యులు, మండల నాయకులు పాల్గొన్నారు.

 

Distribution of CM Relief Fund cheques

More articles

Latest article