25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

కవిత కొత్త పార్టీకి ‘లిక్కర్ పార్టీ’ అని పేరు పెట్టుకో

Must read

📰 Generate e-Paper Clip

 

. .  .  బిజెపి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దంపల్లి జ్యోతి

 

 నిజామాబాద్, బతుకమ్మ :

 

కల్వకుంట్ల కవిత పెట్టబోయే కొత్త పార్టీకి లిక్కర్ పార్టీ అని పేరు పెట్టాలని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దంపల్లి జ్యోతి సూచించారు. శనివారం బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  నిజామాబాద్ జిల్లా పర్యటనలో మాజీ ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలపై  ఫ్లోర్ లీడర్ దంపల్లి జ్యోతి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిన్న నిజామాబాద్ వచ్చి తాను తెలంగాణ ఆడబిడ్డను, నిజామాబాద్ కోడలిని అని కవిత చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం ఇందూరుకు వచ్చినప్పుడు, రాజకీయ అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆమెకు తాను ఆడబిడ్డను, కోడలిని అన్న విషయం గుర్తుకు వస్తుందా? అని ప్రశ్నించారు. శుక్రవారం ప్రెస్ మీట్‌లో కవిత మతిపోయి, మతిభ్రమించి మాట్లాడింది అని విమర్శించారు. అసలు నీకు మతి ఉందా? కళ్లు కనబడుతున్నాయా లేక దొబ్బినాయా? కళ్లు తలకెక్కి ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా తెలుస్తోందా? సెటైర్ వేశారు. ఇందూరు జిల్లాలో ఎంపీ అరవింద్ ధర్మపురి ఏకంగా 10 ఆర్ ఓ బీ లు , ఆర్ యు బిలు మంజూరు చేయించారు. వాటిలో ఇప్పటికే మూడు పూర్తి కాగా, మిగతావి నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. నిన్నగాక మొన్న ఎంపీ సెంట్రల్ రైల్వే మినిస్టర్ ని కలిసి ఇందల్వాయి, నవీపేట్ ఆర్ఓబీలు కూడా శాంక్షన్ చేయాలని కోరారు. జరుగుతున్న ఈ అభివృద్ధి కవితకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. నిజామాబాద్‌కు పసుపు బోర్డు తెచ్చింది పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి కాదా? పసుపు రైతుల సంక్షేమానికి ఆయన కట్టుబడి పని చేస్తున్నారన్నారు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఎంపీగా ఉన్నప్పుడు నిజామాబాద్‌కు ఏం చేశావు? మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించావా? ఆర్ఓబీలు తెచ్చావా? అభివృద్ధిని గాలికి వదిలేసి, లిక్కర్ స్కామ్‌లో వందలు, వేల కోట్లు తగలబెట్టింది వాస్తవం కాదా? ప్రజలకు తెలియచెప్పాలన్నారు.మీ ఇంట్లో మీ తండ్రికి, మీ అన్నకు నీ మాటలంటేనే పట్టింపు లేదు, నువ్వు అరవింద్ గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని అన్నారు. సీఎం రేవంత్ ఉద్దీన్ ఇచ్చిన పైసలు తీసుకొని కొత్త పార్టీ పెడతానని చెప్పులు అరిగేలా తిరుగుతున్నావు. ఏప్రిల్ 25న నువ్వు పెట్టబోయే కొత్త పార్టీకి “లిక్కర్ పార్టీ” అని పేరు పెట్టుకుంటే నీకు కరెక్టుగా సెట్ అవుతుంది అన్నారు. మీ తండ్రి సగం తెలంగాణను నాశనం చేస్తే, మిగిలిన తెలంగాణను కొత్త పార్టీ పేరుతో నువ్వు నాశనం చేయడానికి బయలుదేరావు.ఇంకోసారి మా పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడితే బాగుండదు ఖబడ్దార్ కవిత అని హెచ్చరించారు.ఈ  మీడియా సమావేశంలో కార్పొరేటర్లు ఇప్పకాయల సుమిత్ర దేవి, చింత ప్రసున్నారెడ్డి, కల్పే అర్చన, దాత్రికా రేవతి తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article