30.9 C
Hyderabad
Monday, August 3, 2026

నల్ల పోచమ్మ నూతన ఆలయ కమిటీ ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

 

నందిపేట్, బతుకమ్మ :

 

నందిపేట్ గ్రామ పురాతన నల్ల పోచమ్మ పలుగుట్ట ఆలయ నూతన కమిటీని శ్రీ రామ నవమి పవిత్ర దినాన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ ముగ్గురు అధ్యక్షులు సభ్యులు గ్రామ ప్రజల ఏకగ్రీవ తీర్మానంతో నూతన ఆలయ కమిటీ ఎన్నిక జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ గా మచ్చర్ల సాగర్, వైస్ చైర్మన్ గా తాటికాయల సుభాష్, కోశాధికారిగా ఎర్రం ప్రవీణ్, డైరెక్టర్లుగా పండరి రాజు, కుమ్మరి సాగర్, ఆర్మూర్ గంగారం, ఎర్రం రాజేందర్, జుంబరి సాగర్, నడికుడ రాజేశ్వర్, ధ్యావతి లింగం, చందన్ గంగాధర్, సుంకరి సురేష్, వాల్గోట్ రాజు, వేముల కుమార్, బుక శ్రీకాంత్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీని గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఎర్రం భోజేందర్, మంతెన శీను, మంగి ఎల్లయ్య, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పూలమాల శాలువాతో సన్మానించారు. సనాతన ఆలయ సంరక్షణ, నూతన ఆలయ నిర్మాణం, పలుగుట్ట సంరక్షణే ధ్యేయంగా ఆలయ కమిటీ పని చేస్తుందని వారు తెలిపారు.

Election of new Nalla Pochamma temple committee

More articles

Latest article