27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

గ్యాంగ్ ఫైల్స్ పై కామారెడ్డి ఎస్పీ సమీక్ష

Must read

📰 Generate e-Paper Clip

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లాలో దొంగతనాలు, దోపిడిలు, దారి దోపిడిలపై జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంగళవారం పోలీస్ కమీషనర్ కార్యాలయంలో జిల్లాలో గతంలో నేరాలకు పాల్పడిన అంతర్ రాష్ట్ర మూఠాల నేర చరిత్ర, వారి వ్యవహర శైలీ, సాక్ష్యాదారాల సేకరణపై అధికారులతో సమీక్ష జరిపారు. నేరస్థులకు చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా చూడాలని, విచారణ వేగవంతం చేయాలని సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా కేసులలో త్వరతగతిన న్యాయం జరిగేలా విచారణ జరగాలని, చార్జ్ షీట్ లను వేయాలని, ప్రాపర్టీల రికవరిపై నజర్ వేయాలని కోరారు.

 

Kamareddy SP reviews gang files

 

జిల్లాలో నేరాల నియంత్రణకు ఆపరేషన్ కవచ్ మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. రాత్రివేళ గస్తీలను ముమ్మరం చేయాలని, అనుమానస్పద ప్రాంతాలలో తనీఖీలు చేయాలని కోరారు. ఆధునిక నిఘా వ్యవస్థను సధ్వినియోగం చేసుకుని కేసుల సత్వరం పరిష్కరం చేయాలని అధికారులకు సూచనలు చేశారు. ఈ సమీక్షలో ఎఏస్పీ చైతన్య రెడ్డి, డిఎస్పీలు శ్రీనివాస్ రావు, విఠల్ రెడ్డి, సీఐలు, రైటర్లు సిబ్బంది పాల్గొన్నారు.

 

Kamareddy SP reviews gang files

More articles

Latest article