- భర్తీ చేసినవి 465
- మిగిలిన 131 పోస్టుల భర్తీ ఎప్పుడో?
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో డీఎస్సీ -2024 పోస్టుల భర్తీలో సగం మాత్రమే భర్తీ చేస్తూ అధికారులు జాబితాను ప్రకటించారు.ప్రభుత్వం ఈ నెల 9న ఉపాధ్యాయ పోస్టుల నియామక పత్రాలు అందజేయాలని ఉద్దేశ్యంతో ఇటీవల డీఎస్సీ -2024లో రాత పరీక్ష ద్వారా మెరిట్ సాధించిన 1.3 శాతం అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. అందులో 1.1 నిష్పత్తిలో ఎంపిక జాబితాను మంగళవారం విద్యాశాఖాధికారులు ప్రకటించారు. నిజామాబాద్ జిల్లాకు 601 పోస్టులను కేటాయించగా 465 పోస్టులను భర్తీ చేసినట్లు జాబితాను ప్రకటించారు. కేవలం మెరిట్ జాబితా మాత్రమే అందులో ప్రకటించగా రిజర్వేషన్లు, నాన్ లోకల్ పోస్టుల భర్తీ గురించి వెల్లడించలేదు. ఎప్పుడయిన ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఒక్కసారి మాత్రమే పోస్టుల జాబితాను ప్రకటించాలి.కానీ తొలిసారి 131 పోస్టులను భర్తీ గురించి తెలుపకుండానే జాబితాను ప్రకటించారు. ప్రభుత్వం దానిపై ఎలాంటి నిర్ణయం ప్రకటించకుండానే సగం పోస్టుల భర్తీకి మాత్రమే అధికారులు జాబితా ప్రకటించడం పట్ల చర్చ జరుగుతుంది.
