25.3 C
Hyderabad
Tuesday, August 4, 2026

కేంద్ర ప్రభుత్వ మతోన్మాద ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి 

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పి డి ఎస్ యూ,పి వై ఎల్ నాయకులు 

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 

 

కేంద్ర ప్రభుత్వ మతోన్మాద ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా, యుద్ధోన్మాద దాడులకు వ్యతిరేకంగా అమరవీరులు భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ ల పోరాట స్ఫూర్తితో పోరాడాలని పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్,పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు వనమాల సత్యం లు పిలుపునిచ్చారు. భగత్ సింగ్ ,రాజ్ గురు , సుఖదేవ్ ల 95 వ వర్దంతుల సందర్భంగా నిజామాబాద్ నగరంలో కోటగల్లి, సాయి రెడ్డి పెట్రోల్ బంక్ వద్ద ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారత విప్లవ చేగువేరాలు భగత్ సింగ్ ,రాజ్ గురు ,సుఖదేవ్ లు దేశం కోసం పరాయిపాలన నుండి విముక్తి కోసం సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా వారి ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించారని, నేడు దేశంలో మోడీ ప్రభుత్వం స్వదేశీ జపం చేస్తూ విదేశీ పెట్టుబడిదారీ కంపెనీలకు ఈ దేశ సంపదను దారా దత్తం చేస్తున్నారని ఆరోపించారు. విద్యలో అశాస్త్రీయ భావజాలాన్ని ప్రవేశపెడుతూ నూతన జాతీయ విద్య విధానాన్ని తీసుకువచ్చారని, దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం వలన కోట్లాది యువత రోడ్లమీద తిరుగుతున్నారని, ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ దాడులను మోదీ ప్రభుత్వం ఖండించాలని డిమాండ్ చేశారు. విద్య ,ఉపాధి అవకాశాల కోసం సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా అమరవీరుల పోరాట స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంట్యాల రమేష్, పిడిఎస్ యూ నగర అధ్యక్షులు సిర్రం పవన్ కుమార్, జిల్లా నాయకులు మనోజ్ కుమార్, నగర నాయకులు దత్తు , భవాని, పి వై ఎల్ నాయకులు కత్తుల సాయిలు, భాస్కర్ , పి డి ఎస్ యూ నాయకులు యువ, ధ్రువ ప్రవీణ్ ,రమేషు ,కళ్యాణ్ ,జీవన్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article