రుద్రూర్, బతుకమ్మ :
ఉగాది పండుగను పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ముందుగా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శివాజీ యూత్ సభ్యులు గుండూరి ప్రశాంత్ గౌడ్, భోజగొండ అనిల్, కుమ్మరి గణేష్, ఏముల గజేందర్, వడ్ల నరేష్, భరత్, ధర్మారం వెంకటేష్, యువకులు తదితరులు పాల్గొన్నారు.
