భిక్కనూరు, బతుకమ్మ
భిక్కనూరు మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో అర్హులైన వారిని గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయాలని మండల బిజెపి శాఖ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి లక్ష్మికి తెలియజేశారు. ఇందిరమ్మ ఇళ్లకు అర్హులుగా గుర్తించి వారికి పార్టీలకతీతంగా అందించాలని బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్ డిమాండ్ చేశారు. గ్రామంలో అర్హత ఉన్నప్పటికీ కొందరికి ఇల్లు కేటాయించలేదని నిరుపేద కుటుంబాలు, ఇల్లు లేని వారిని గుర్తించి న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు మెట్టు స్వామి, బండమీది రాజు, తిరుమలేష్, పొన్నాల రంజిత్, పిట్ల రాజయ్య, వల్లకొండ కొండ రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
