25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

తెలంగాణకు త్వరలో కొత్త పోలీస్ బాస్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఏప్రిల్ చివరన శివధర్ రెడ్డి పదవి విరమణ

 

. . . సీవి ఆనంద్ కు అవకాశం

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణకు కొత్త పోలీస్ బాస్ ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరింది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఏప్రిల్ 30 న పదవి విరమణ చేయనున్నారు. ఇటీవల రాష్ట్ర డీజీపీ ఎంపిక ప్రక్రియ కు ఢిల్లీలో ఎంపిక కమిటీ సమావేశానికి సీఎస్ రామకృష్ణారావు హాజరయ్యారు. తెలంగాణ డీజీపీ రేసులో సీవీ ఆనంద్ , శిఖా గోయల్,  సౌమ్య మిశ్రా,  వినాయక్ ప్రభాకర్ ఆప్టే పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం.  నలుగురిలో ఒకరి పేరు తీసేసి ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను యూపీఎస్ సీ రాష్ట్రానికి పంపనుంది. యూపీఎస్ సీ పంపిన ముగ్గురిలో ఒకరిని ప్రభుత్వం ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డి సీవీ ఆనంద్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. సీవి ఆనంద్ కన్న ఇద్దరు జూనియర్ లు జితేందర్, శివధర్ రెడ్డి లు డీజీపీలుగా అవకాశం కలిపించినప్పుడు ఆయన రేవంత్ ప్రభుత్వం పై కినుకు వహించారు. ఇటీవలనే ఆనంద్ హైదరాబాద్ కమీషనర్ గా నియమితులైన తరువాత డీజీపీ పదవికి ఆయనే న్యాయం చేయగలడని పేరును ప్రతిపాదించినట్లు తెలిసింది.

 

Telangana to get new police chief soon
Telangana to get new police chief soon

 

 

Telangana to get new police chief soon
Telangana to get new police chief soon

More articles

Latest article