30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

“జీతం నుండి ఆదాయం” పై విద్యార్థులకు అవగాహన

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో సోమవారం కామర్స్ విభాగం ఆధ్వర్యంలో “జీతం నుండి ఆదాయం” అనే అంశంపై ఏర్పాటు చేసిన విస్తృత ఉపన్యాసంలో ఆర్మూరు ప్రభుత్వ కళాశాల వాణిజ్య శాస్త్ర అధ్యాపకులు ఇ.రాజ్ కుమార్ ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థుల “ఇన్ కమ్ టాక్స్ సబ్జెక్టు” పాఠ్యాంశానికి అనుగుణంగా ఏర్పాటు చేసిన ఈ విస్తృత ఉపన్యాసంలో ఉద్యోగి ఆదాయం లెక్కింపు, పన్ను విధింపులో వచ్చే వివిధ అంశాలు, మూల వేతనం, వివిధ భత్యాలు, పరిలబ్దులు, జీతానికి బదులుగా ఉండే లబ్ధి, తదితర అంశాలపై రాజ్ కుమార్ విద్యార్థులకు లోతైన అవగాన కలిగించారు. ఈ సందర్భంగా వాణిజ్య శాస్త్ర విభాగం అధిపతి వినయ్ కుమార్, అధ్యాపకులు ఇ. రాజ్ కుమార్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సతీష్, సుమన్, భాస్కర్, రాహుల్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 

Students' awareness on "Income from Salary"

More articles

Latest article