25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

నాగేంద్ర నగర్ గ్రామంలో ప్రజా పాలన,ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

Must read

📰 Generate e-Paper Clip

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

మండలంలోని నాగేంద్ర నగర్ గ్రామంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఆదివారం ప్రతి ఇంటి నుండి  తడి, పొడి చెత్తను విడిగా ఇవ్వాలని అవగాహన కల్పించారు. అలాగే తడి, పొడి చెత్తను ట్రాక్టర్ లో విడిగా తీసుకొని కంపోస్టు షెడ్డు కు తరలించి తడి చెత్త తో సేంద్రియ ఎరువు తయారు చేస్తామని, పొడి చెత్త లో ఉన్న ప్లాస్టిక్, బీరు సీసాలు, అట్ట ముక్కలు అమ్మివేయటం జరుగుతుందని దాని వల్ల గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరుతుందని సర్పంచ్ సందే రంజిత్, ఉప సర్పంచ్ షేక్ జాకీర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సంధ్యారాణి, కారోబార్ జనార్ధన్, వార్డు మెంబర్లు ఎర్రాజి హరీష్, కనగర్తి శ్రీనివాస్, షేక్ సాహెరబాను, షేక్ తస్లిం, ఆశలు సరస్వతి గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article