ఎల్లారెడ్డి, బతుకమ్మ :
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన ఆశా వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే కి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారు. అయితే ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో ఆశా వర్కర్లు వీడియో కాల్ ద్వారా ఆయనతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు తమకు ఎదురవుతున్న సమస్యలను వివరించగా, ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. మీ సమస్యల గురించి పార్లమెంట్ సభ్యుడు (ఎంపీ) తో మాట్లాడి వీలైనంత త్వరగా పరిష్కారం చేసేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు ఆశా వర్కర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంజుల సహా పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఆశా వర్కర్ల సమస్యలు త్వరగా పరిష్కారం కావాలని వారు కోరారు.
