30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ఓబీసీ మోర్చా అర్బన్ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ నమోదు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  ఓబిసి మోర్చా నిజామాబాద్ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ హాజరైయారు.‌ ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పోలింగ్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడం కొరకు మెంబర్షిప్ డ్రైవర్ ను చేపట్టడం జరుగుతుందని అన్నారు. ప్రతి పోలింగ్ బూత్ లో కచ్చితంగా 200 మంది సభ్యులను భారతీయ జనతా పార్టీలో చేరే విధంగా పోలింగ్ బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు, కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి, ఓబిసి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాస్టర్ శంకర్, ఓబిసి మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఇప్పాకాయల కిషోర్, ఓబిసి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కోడూరు నాగరాజు, అర్బన్ అసెంబ్లీ కన్వీనర్ గిరిబాబు, బిజెపి అర్బన్ అసెంబ్లీ కో కన్వీనర్ నారాయణ యాదవ్, ఓబిసి మోర్చా జిల్లా నాయకులు, మండలాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article