బతుకమ్మ,మోర్తాడ్: శే ట్ పల్లీ గ్రామంలోని దుర్గాదేవి మండపంలో అన్నదాన సత్రం నిర్వహించారు. అలాగే గ్రామంలోని శివాలయం లో సైతం ప్రతి నెల మొదటి సోమవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామంలోని భక్తులు ఉదయం నుంచి దుర్గాదేవి మండపంలో, శివుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో ముదిరాజ్ యువసేన సభ్యులు బొమ్మ శ్రీనివాస్, అరవింద్, ప్రవీణ్, రాజేందర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
