26.2 C
Hyderabad
Monday, August 3, 2026

శిక్షణ పూర్తి సర్టిఫికెట్లు అందజేత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మోర్తాడ్: ప్రతి గ్రామ పంచాయతీ నుంచి చురుకైన వ్యక్తులను ఎంపిక చేసి వారం రోజులపాటు మోర్తాడ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మోర్తాడ్,ఏర్గట్ల మండలాలకు చెందిన మంచినీటి సహాయకులకు శిక్షణ ఇచ్చామని జిల్లా మిషన్ భగీరథ వాటర్ క్వాలిటీ ల్యాబ్ ఇంచార్జ్ లక్ష్మీనారాయణ అన్నారు. చేతి పంపు మరమ్మత్తులు, ప్లంబింగ్ పనులు, సింగిల్ ఫేస్/త్రీ ఫేస్, వాటర్ క్వాలిటీ వంటి అంశాలపై శిక్షణ చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వీళ్ళు పరిష్కరించే విధంగా శిక్షణ అందించి సోమవారం వారికి సర్టిఫికెట్ అందజేయడం జరిగింది. కార్యక్రమంలో బాల్కొండ గ్రిడ్ డీ ఈ ఈ అమీర్ ఖాన్, మోర్తాడ్, ఏర్గట్ల ఏ ఈ ఈ స్వరాజ్, మోర్తాడ్, ఏర్గట్ల మండలాల మంచినీటి సహాయకులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article