29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఎస్సైలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టివేత

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

సైబర్ క్రైం కేసులో ఒక బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయకుండా ఉండేందుకు లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా ఇద్దరు ఎస్సైలు ఏసీబీకి చిక్కారు. ఈ సంఘటన సోమవారం హైదరాబాద్ లోని ఎల్ బి నగర్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ లో జరిగింది. హైదరాబాద్ రేంజ్ ఏసీబీ -2 డీఎస్పీ గంగాసాని శ్రీధర్ ఆధ్వర్యంలో సోమవారం సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ లో దాడులు నిర్వహించారు. సైబర్ క్రైం కేసులో బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయకుండా ఉండేందుకు ఆర్ఎస్సైలు ప్రమోద్ కుమార్ గౌడ్, బాబునాయక్ లు బాధితుని నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అనంతరం సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ లో సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

Two SIs caught by ACB

 

More articles

Latest article