28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎస్ ఎస్ బాలాజీ హాస్పిటల్ ప్రసూతి నిపుణులు డా.ఇందిరా చౌహన్

 

. . . ఘనంగా అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ

 

మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని, ప్రతీ మహిళా ముందంజలో నిలబడాలని డా.ఇందిరా చౌహన్ అన్నారు. నగరంలోని 7వ డివిజన్ లో జనసేన పార్టీ నాయకులు నూర రాహుల్ (శివ) ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిలుగా ఎస్. ఎస్ బాలాజీ హాస్పిటల్ ప్రసూతి నిపుణులు డాక్టర్ ఇందిరా చౌహన్, జనసేన పార్టీ ఇందూర్ జిల్లా అధ్యక్షులు గుండా సంతోష్, మహిళా మండలి అధ్యక్షురాలు గుజ్జా రాజేశ్వరి, చైతన్య విద్యా సంస్థ ప్రిన్సిపాల్ యోజన రెడ్డి, ప్రజా సేవకురాలు నూర నాగమణి, శివమ్ -సవ్యసాచి ఆర్ట్స్ & భగవద్గీత అకాడమీలో భగవద్గీత బోధన అధ్యాపకురాలు కావ్యప్రభ జోషి,ఈ అకాడమీ ముఖ్యసలహా దారు నూర స్రవంతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో భాగంగా గుజ్జా రాజేశ్వర్ మహిళా యొక్క ప్రాముఖ్యత కుటుంబంలో ఏ విదంగా ఉండాలో తెలియజేసారు. యోజనరెడ్డి మాట్లాడుతూ ప్రతి మహిళా విద్యారంగంలో, సామజిక రంగంలో ముందుండాలని వ్యక్తపరిచారు. జనసేన పార్టీ నాయకులు నూర రాహుల్ మాట్లాడుతూ భగవద్గీత మన నిజ జీవితం లో ఏ విదంగా ఉపయోగపడుతుందో వివరించి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జనసేన పార్టీ వీర మహిళలందరికి సన్మానం చేసి భగవద్గీత పుస్తకాలను అందజేశారు.

Women should be encouraged in all fields.

 

More articles

Latest article