27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కలర్ ఫుల్ “హోలీ”జోష్

Must read

📰 Generate e-Paper Clip

. . . చిన్న పెద్ద తేడా లేకుండా హోలీ పండగ

ఇందల్వాయి, బతుకమ్మ

ఇందల్వాయి మండల కేంద్రంలో వివిధ గ్రామాలలో సోమవారం హోలీ పండగను ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం చంద్రగ్రహణం ఉండడంతో ఆదివారం రాత్రి కామ దహనం నిర్వహించి ఒక్కరోజు ముందుగానే హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా రంగులలో మునిగితేలారు. ఆదివారం రాత్రి కోలాటాలతో ఆటపాటలతో పలువురుని ఆకర్షించాయి. గ్రామాలలో ఉండే కాముని గుండులను పోటాపోటీగా పైకెత్తి వీధులలో మోసుకెళ్లారు. పాతరంగుల హోలీని పారదోలీ కొత్త రంగుల ప్రపంచంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని జరుపుకున్నారు. ఈ హోలీ పండుగలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఉపసర్పంచులు వార్డు మెంబర్లు ఆనందోత్సవంతో పాల్గొన్నారు. వినాయక చవితి, దసరా, దీపావళి తర్వాత అత్యంత విశిష్టమైన పండగగా హోలీ పండగను ప్రజలు జరుపుకుంటారు.

More articles

Latest article