24.7 C
Hyderabad
Monday, August 3, 2026

మహిళలు సబ్సిడీ లోన్లను సద్వినియోగం చేసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

మహిళా సమాఖ్య లోని మహిళలు సబ్సిడీ లోన్లను సద్వినియోగ చేసుకొని ఆర్దికంగా ఎదగడానికి మంచి అవకాశం అని జిల్లా టీ ఎన్ జీ వో ఉపాధ్యక్షుడు బత్తుల మాణిక్యం అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో గురువారం నిర్వహించిన పీఎంఎఫ్ఎంఈ  స్పాట్ రిజిస్ట్రేషన్ డీపీఆర్ ఎంట్రీ కార్యక్రమంలో లోన్స్ పై అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న రూ. లక్షకు 35% సబ్సిడీ వినియోగించుకొని మహిళలు ఆర్దికంగా ఎదగాలని పేర్కొన్నారు. మహిళలు అధిక సంఖ్యలో వినియోగించుకొని ఆదాయాభివృద్ధి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపీయం రాజయ్య, జిల్లా ఏపియం రవి, మోర్తాడ్ ఎపియం గంగారెడ్డి, సీ సీ లు తడకల శ్రీనివాస్, మురళీ, మహేందర్, గాజుల శ్రీనివాస్, సరళ, రాధ, లక్ష్మీ, లబ్దిదారులకు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article