24 C
Hyderabad
Sunday, August 2, 2026

నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సందర్శనకు తరలివెళ్లిన విద్యార్థులు

Must read

📰 Generate e-Paper Clip

 

భిక్కనూరు, బతుకమ్మ :

 

భిక్కనూరు మండలంలో గల ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సిఐ గడ్డం మల్లేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి సహకారంతో హైదరాబాద్ లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఆజాద్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ సందర్శనకు ప్రత్యేక వాహనాల్లో గురువారం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎంఈఓ రాజగంగారెడ్డి మాట్లాడుతూ గడ్డం మల్లేష్ నిర్వహించిన ప్రతిభ పరీక్షలో ప్రతిభ చూపిన 39 మంది విద్యార్థులను ఈ యాత్రకు తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా గడ్డం మల్లేష్ కు, చంద్రకాంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బల్యాల రేఖ, సుదర్శన్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article