26.3 C
Hyderabad
Monday, August 3, 2026

పిల్లల ఆరోగ్యం, విద్యాభివృద్ధే గ్రామ అభివృద్ధికి పునాది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కారేగాం తాండా సర్పంచ్ డా.రామావత్ లాల్ సింగ్

 

. . . విద్యార్థులతో కలిసి భోజనం చేసిన సర్పంచ్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

పిల్లల ఆరోగ్యం, విద్యాభివృద్ధే గ్రామ అభివృద్ధికి పునాది అని కారేగాం తాండా సర్పంచ్ డా.రామావత్ లాల్ సింగ్ అన్నారు. కారేగాం తాండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించబడుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించేందుకు గురువారం సర్పంచ్ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి, భోజన నాణ్యత, శుభ్రత, వంట విధానం తదితర అంశాలను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం పోషక విలువలతో ఉండాలని, శుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సర్పంచ్ పాఠశాల సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి విద్యార్థికి సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంపై గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

 

Children's health and education are the foundation of village development.

 

More articles

Latest article