26.2 C
Hyderabad
Monday, August 3, 2026

పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జనసేన పార్టీ నాయకురాలు సరిత మానేకర్

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

బిచ్కుంద మున్సిపాలిటీ కేంద్రంలో జనసేన పార్టీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జనసేన పార్టీ వీర మహిళ నాయకురాలు సరిత మానేకర్ హాజరై మాట్లాడుతూ ఫిబ్రవరి 26వ తేదీ నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు ప్రారంభం కాబోతున్నాయని, బిచ్కుంద మండలంలోని ప్రతి గ్రామం నుంచి భారీ సంఖ్యలో క్రియాశీలక సభ్యత్వాలను తీసుకోవాలని పేర్కొన్నారు. జనసేన పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జాజారి దినేష్, జీవన్ నాయక్, బాస పవన్, మధుకర్, పత్తి సాయి, సంతోష్, ముషీర్ నాగరాజు, ప్రసాద్, అరవింద్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article