23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని అమలు చేయండి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . టీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రాష్ట్రంలో త్వరలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం అమలు చేయనున్న ఆరోగ్య పథకంలో జర్నలిస్టులను చేర్చి వారికి కూడా ఆ పథకం అమలయ్యేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో ఆయన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహాను కలిసి జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ పై చర్చించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు ఆరోగ్య పథకాన్ని ప్రవేశ పెట్టిందని, అదే మాదిరిగా ప్రస్తుతం అమలు చేయాలని విరాహత్ అలీ మంత్రిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.

More articles

Latest article