23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

సీఎం సహాయనిది చెక్కు అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

మండలంలోని బట్టపూర్ గ్రామనికి చెందిన పేద కుటుంబానికి మంజూరైన సీఎం సహాయనిధి చెక్కును స్థానిక కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బాలే శ్రీనివాస్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం రోజున అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలే శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ కరీం మాట్లాడుతూ బట్టపూర్ గ్రామానికి చెందిన పేద కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ది చేకూర్చాలని అడిగిన వెంటనే మంజూరు ఇప్పించిన బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు గ్రామ కాంగ్రెస్ పార్టీ తరపున, లబ్ధిదారుని తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంలో లబ్ధిదారులు సునీల్ కుమార్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ప్రసాద్, నాగుల్, కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article