24 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రతి పక్షాల కుయుక్తులను ప్రజలు తిప్పి కొట్టారు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . విలేకరుల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ర్టంలో మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్షాల కుయుక్తులను తిప్పి కొట్టారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రుల సమిష్టి కృషితో రాష్ర్ట వ్యాప్తంగా దాదాపు 75 శాతానికి పైగా మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం శుభ పరిణామమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఓటరు మహాశయులకు శిరస్సు వంచి వందనాలు తెలుపుతున్నానని, మార్పును కోరుకున్న ప్రజలు, మా ప్రభుత్వంపై నమ్మకాన్ని మరోసారి బలపరిచారని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసినా కూడా కనీసం 25 శాతం కూడా దాటలేకపోయాయని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో మతం పేరిట రెచ్చగొట్టే రాజకీయాలు చేసే వారికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని అన్నారు. వచ్చే సార్వత్రి ఎన్నికల్లోనూ ఇదే జోరు కొనసాగిస్తామని, 100కు పైగా అసెంబ్లీ స్థానాలను గెలిచి  తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ 75 శాతానికి పైగా స్థానాల్లో జెండా పాతడమే లక్ష్యంగా పని చేస్తామని స్పష్టం చేశారు.

More articles

Latest article