27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

4వ రోజు కొనసాగుతున్న బతకమ్మ సంబరాలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ పాటలతో ఆకట్టుకున్న ఆడపడుచులు

ఇందల్వాయి,బతుకమ్మ :  ఇందల్వాయి మండల పరిధిలోని ఇందల్వాయి గన్నారం, తిరుమన్ పల్లి, చంద్రాయన్ పల్లి, లోలం, ఎల్లారెడ్డిపల్లి, గౌరారం, తదితర గ్రామాలలో నాలుగవ రోజు  బతుకమ్మ సంబరాలు శనివారం నిర్వహించారు. వీధి వీధిలో బతుకమ్మ పండగ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ తమ ఆటపాటలతో ఆలరిస్తూ,బతకమ్మ సంబరాలు జరుపుకున్నారు. దేశంలోనే ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం వల్ల తమ చిన్ననాటి స్నేహితులు, అక్క చెల్లెలు, ఒకే దగ్గర, ఒకే ఊరిలో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాలుగవ రోజు నాన బియ్యం బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.ఐదవరోజు అటుకుల బతుకమ్మ పండుగ సంబరాలు చూడాల్సిందే మరి. చిన్నారులు బతుకమ్మ పండగలో చూపరులను అకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల ఆడ పడచులు పాల్గొన్నారు.

More articles

Latest article