26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . టీయూసీఐ  జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్

 

కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా, పనిగంటల పెంపుదలకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12న జరిపే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ అన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె పోస్టర్లను కోటగల్లి లోని శ్రామిక భవన్ వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 12 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోయాయన్నారు. అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయని, కానీ కార్మికుల వేతనాలు మాత్రం పెరగలేదన్నారు. కార్మికులకు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కరువైందని, మోడీ ప్రభుత్వం అవలంబించిన కార్పోరేట్ కంపెనీల అనుకూల, కార్మిక వ్యతిరేక విధానాలే ఇందుకు కారణమన్నారు. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, కనీస వేతనాల అమలు కోసం, కనీస పెన్షన్ 9వేల అమలు కోసం సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. ఈ సమ్మెలో జిల్లాలోని కార్మికులందరూ పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీయుసీఐ జిల్లా ఉపాధ్యక్షులు డి.రాజేశ్వర్, నాయకులు విటల్, సాయిబాబా, గంగాధర్, మనోజ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article