25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

తె.యూ పీజీ మూడవ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ మూడవ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమైనట్టు వైస్ చాన్స్ లర్ టి.యాదగిరి రావు తెలిపారు. విశ్వవిద్యాలయంలోని పరీక్షా కేంద్రాన్ని కళాశాల ప్రిన్సిపల్ జి రాంబాబు, పరీక్షల నియంత్రణ అధికారి సంపత్ కుమార్, ఆడిట్ సెల్ డైరెక్టర్ గంటా చంద్రశేఖర్ లు కలిసి తనిఖీ చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 1981 విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా 1902 మంది విద్యార్థులు హాజరయ్యారని, 77 మంది విద్యార్థులు గైరాజరయ్యారని అన్నారు. అలాగే ఇద్దరు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కింద నమోదయ్యారని చంద్రశేఖర్ తెలిపారు.

More articles

Latest article