30.9 C
Hyderabad
Monday, August 3, 2026

విజయ మేరీ పాఠశాలలో స్ట్రాంగ్‌రూమ్‌లు, ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన

Must read

📰 Generate e-Paper Clip

 

బోధన్, బతుకమ్మ :

 

బోధన్ మున్సిపాలిటీ 2వ సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా అడిషనల్ కలెక్టర్  అంకిత్, సబ్‌ కలెక్టర్ వికాస్ మహతోతో కలిసి బోధన్ పట్టణంలోని విజయ మేరీ హై స్కూల్‌ను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లు, రిసీవింగ్ & డిస్ట్రిబ్యూషన్ సెంటర్, కౌంటింగ్ హాల్‌ల ఏర్పాట్లను పరిశీలించారు. అంతకుముందు లయన్స్ హాస్పిటల్ హాల్‌లో నిర్వహించిన పీఓ/ఏపీఓ శిక్షణా కార్యక్రమానికి వారు హాజరయ్యారు. అనంతరం విజయ మేరీ పాఠశాలలో ఎన్నికల సామగ్రి భద్రతకు తీసుకున్న చర్యలపై సమగ్రంగా సమీక్షించారు. స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద చేపట్టిన భద్రతా చర్యలు, సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ, సీల్ విధానం తదితర అంశాలను పరిశీలించి, ఎన్నికల సామగ్రి భద్రతలో ఎలాంటి లోపాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, తహసీల్దార్ విట్ఠల్, బోధన్ టౌన్ సీఐ వెంకటనారాయణ,  పాటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Inspection of strongrooms and election arrangements at Vijaya Mary School
Inspection of strongrooms and election arrangements at Vijaya Mary School

More articles

Latest article