. . . ఏర్గట్లలో బిఆర్ఎస్ పార్టీ నాయకులచే ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
ఏర్గట్ల, బతుకమ్మ :
మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఫోన్ టాపింగ్ కేసులో అక్రమంగా పోలీసులు సిట్ నోటీసులు ఇచ్చి కేసీఆర్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మను మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు దగ్ధం చేయడం, అలాగే నిరసనగా నల్ల జండాలను పట్టుకొని మోటార్ సైకిల్ పై గ్రామంలో ఊరేగింపుగా బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పూర్ణానందం, ఏర్గట్ల గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, బట్టాపూర్ సర్పంచ్ ప్రవీణ్ యాదవ్, మాజీ జెడ్పిటిసి గుల్లే రాజేశ్వర్, బర్మ చిన్న నరసయ్య, సిగసారం గంగారం, మాజీ ఎంపీటీసీ డాక్టర్ మధు, తుపాకుల శ్రీనివాస్ గౌడ్, బద్దం ప్రభాకర్, కొలిప్యాక శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బద్దం శ్రీనివాస్, నేరెళ్ల నరేందర్, రొక్కెడ మోహన్, నిమ్మన గంగయ్య, గడ్డం మోహన్, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఇబ్రహీంపట్నం నరసయ్య, మండల పరిధిలోని గ్రామ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

