29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

అవకాశమిస్తే అభివ్రద్ది చేస్తా…

Must read

📰 Generate e-Paper Clip

 

బోధన్, బతుకమ్మ :

 

బోధన్ పట్టణం 18వ వార్డు  కౌన్సిలర్ అభ్యర్థిగా చిత్రాల ప్రమోద్ చిన్న గురువారం నామినేషన్ దాఖలు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంబంధిత రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో  తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా చిత్రాల ప్రమోద్ చిన్న మాట్లాడుతూ, వార్డు ప్రజలు తనపై నమ్మకం ఉంచి ఒక్క అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్లు, ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వార్డు అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలియజేస్తూ, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని వార్డు ప్రజలను కోరారు.

More articles

Latest article