28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

మోగిన మున్నిపల్ ఎన్నికల నగారా

Must read

📰 Generate e-Paper Clip

. . . రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ

 

. . . ఈ నెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ

 

. . . ఫిబ్రవరి 11న ఎన్నికలు

 

. . . ఫిబ్రవరి 13న కౌంటింగ్ . . 16న మేయర్, చైర్మన్ ల ఎన్నిక

 

. . . అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపోల్ కు నగారా మోగింది. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమోదిని ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. ఎలక్షన్ కమిషనర్ ప్రకటనతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నెల 28 నుంచి రాష్ర్టంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్ లు, 116 మున్సిపాలిటీల్లో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ నెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. ఈ నెల 31 న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఫిబ్రవరి 3 న నామినేషన్ల విత్ డ్రా నిర్వహిస్తారు. ఫిబ్రవరి 11న మున్సిపాల్ కార్పొరేషన్ లలో, మున్సిపాలిటీల్లో పోలింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి 13 న ఓట్ల లెక్కింపు నిర్వహించి విజేతలను ప్రకటిస్తారు. ఫిబ్రవరి 16 న రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 7 మున్సిపల్ కార్పొరేషన్ లు, 116 మున్సిపాలిటీల్లో మేయర్, డిప్యూటి మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లను ఎన్నుకుంటారు.

 

 

The city of Moginah municipal elections

More articles

Latest article