26.2 C
Hyderabad
Monday, August 3, 2026

రుద్రూర్ మండల సర్పంచ్ ల సంఘం నూతన కమిటీ ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల సర్పంచ్ ల సంఘం నూతన కమిటీని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా కొండల్ వాడి శంకర్ (రాణంపల్లి), ఉపాధ్యక్షురాలుగా పరుచూరి పద్మ(రాయకూర్ క్యాంపు), ప్రధాన కార్యదర్శిగా మచ్కూరి రమేష్, (చిక్కడపల్లి), కోశాధికారిగా కుర్లం గంగాధర్ (అంబం ఆర్), సహాయ కార్యదర్శిగా గొంటి సాయిలును నియమించారు. అనంతరం వారిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, జాహరాబాద్ పార్లమెంట్ కమిటీ మెంబర్ నడిపింటి నగేష్, సర్పంచ్ లు రుద్రూర్ గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, రాయాకూర్ సర్పంచ్ పి. గంగమ్మ, అక్బర్ నగర్ సర్పంచ్ సీతారామరాజు, సిద్దాపూర్ సర్పంచ్ అనిత, బొప్పాపూర్ సర్పంచ్ సుమలత, సులేమాన్ నగర్ సర్పంచ్ ఆఫ్రిన్ బేగం తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article