24.7 C
Hyderabad
Monday, August 3, 2026

వైభవంగా భక్త మార్కండేయ జయంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ :

రుద్రూర్ మండల కేంద్రంలోని మార్కండేయ మందిరంలో బుధవారం పద్మశాలి ఆరాధ్య దైవం భక్త మార్కండేయ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మార్కండేయ జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఊయల కట్టి, హారతి పాటలు పాడారు. అనంతరం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రుద్రూర్ అధ్యక్షులు గెంటిల సాయిలు, అన్నదాత తాటిపాముల సురేష్, మోత్కూరి నారాయణ, గెంటిల గంగాధర్, పాముల శంకర్ (పిడుగు) పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article