26.6 C
Hyderabad
Monday, August 3, 2026

కానిస్టేబుల్ ప్రమోద్ త్యాగం పోలీస్ శాఖకు స్పూర్తిదాయకం

Must read

📰 Generate e-Paper Clip

. . . ముగిసిన ప్రమోద్ కుమార్ స్మారక ఫుట్బాల్ టోర్నమెంట్

. . . గెలుపొందిన టీం లకు బహుమతులు అందజేసిన సీపీ

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించిన ప్రమోద్ కుమార్ త్యాగం పోలీస్ శాఖకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ శాఖలో విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన ప్రమోద్ కుమార్ జ్ఞాపకార్థం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ యువతను ప్రోత్సహించే క్రమంలో భాగంగా గత రెండు రోజుల నుండి ఫుట్బాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య హాజరయ్యారు. ఈ సంధర్భంగా సీపీ మాట్లాడుతూ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సంఘవిద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందిన మన సహచరుడు కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్  జ్ఞాపకార్థంగా నిర్వహించిన ఫుట్‌బాల్ టోర్నమెంట్ నేడు విజయవంతంగా ముగియడం ఎంతో సంతోషకరమన్నారు. ప్రతి ఒక్క క్రీడాకారులు అంకితభావంతో కృషి చేయడం వలన క్రీడలలో విజయం సాధించడం జరుగుతుందని, క్రీడలలో పోటీ తత్వం ఎంత ముఖ్యమో ఈ క్రీడల వలన నలుగురిలో మాట్లాడడం అలవరచుకోవడం కూడా అంతే ముఖ్యమన్నారు. ఏ ఒక్క క్రీడాకారులకు కూడా ఎలాంటి గాయం కలగకుండా ఉండడం ఎంతో సంతోషకరమైన విషయమని, అదే విధంగా వాహనాలు నడిపేటప్పుడు కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్న అన్ని జట్లకు, నిర్వాహకులకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వాన్ని కూడా పెంపొందిస్తాయని, ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పుకు దోహదపడతాయన్నారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ మధ్యకాలంలో మారుమూల గ్రామాలలో యువత డ్రగ్స్ ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు యువత కోసం క్రీడలను నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా సే నో టు డ్రగ్స్ , సే ఎస్ టు స్పోర్ట్స్ అనే నినాదం యువతకు తెలియజేశారన్నారు. వీర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలను కొనసాగించడం మనందరి బాధ్యతని, ప్రమోద్ కుమార్ కుటుంబానికి మరోసారి నా సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే గత వారం ప్రారంభమైన అరైవ్ – అలైవ్ కార్యక్రమంలో భాగంగా ప్రజల భద్రత, రోడ్డు భద్రత , ట్రాఫిక్ నియమాలు, ప్రమాద నివారణ సూచనల గురించి క్షుణ్ణంగా ప్రస్తావించారు.  ఈ టోర్నమెంట్ లో మహిళల విభాగంలో డాక్టర్ కవితా రెడ్డి క్లబ్ విన్నర్, జ్యోతి ఫుట్బాల్ క్లబ్ రన్నర్ గా నిలిచాయి. పురుషుల విభాగంలో కేర్ ఫుట్బాల్ క్లబ్ విన్నర్ గా, నిజామాబాదు పోర్టింగ్ క్లబ్ రన్నర్ గా, ఫెయిర్ ప్లే లో ఉమెన్స్ కాలేజీ, పోలీస్ టీం విన్నర్ గా నిలిచాయి. అనంతరo గెలుపొందిన క్రీడాకారులకు పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా బహుమతులను ప్రధానము చేశారు. రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా హెల్మెట్లు కుడా ప్రధానం చేశారు. ఈ సందర్భంగా అదనపు డి.సి.పి (అడ్మిన్) జి. బస్వా రెడ్డి,  అదనపు డి.సి. పి (ఏ. ఆర్) రామచందర్రావు,  నిజామాబాదు ఎసిపి రాజా వెంకటరెడ్డి, ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రెటరీ జావీద్, జాయింట్ సెక్రెటరీ మసూద్,  కోచ్ నాగరాజు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం , టౌన్ సిఐ శ్రీనివాస రాజ్, జిల్లాలోని సిఐలు, ఎస్సైలు, జిల్లాలోని ఫుట్బాల్ క్రీడాకారులు వారి టీంలు పాల్గొనడం జరిగింది.

Constable Pramod's sacrifice is an inspiration to the police department
Constable Pramod’s sacrifice is an inspiration to the police department

More articles

Latest article