. . . కండువా కప్పి ఆహ్వానించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :
ధర్పల్లి మండలం సర్పంచ్ భూక్యా లత పాండు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నగరంలోని గూపన్ పల్లి బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి సమక్షంలో భూక్యా లత పాండు కండువా కప్పుకొని పార్టీలో చేరారు. తాజాగా జరిగిన గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్‌గా గెలుపొందిన భూక్యా లత పాండు తో పాటు వారి వార్డు సభ్యులు కూడా కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నమ్మకాన్ని కలిగించాయని, ఆ నమ్మకమే కాంగ్రెస్‌లో చేరడానికి కారణమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలరాజ్,రాజ్యం, ఆనంద్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.
