27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

గ్రామ సంఘాలలో కిషోర బాలికలకు శిక్షణలు

Must read

📰 Generate e-Paper Clip

వేల్పూర్, బతుకమ్మ:

 

వేల్పూర్ మండల మహిళా సమాఖ్య లోని ప్రతి ఒక్కరు తమ గ్రామంలోని కిశోర బాలికలను గుర్తించి ఆరోగ్యం, పౌష్టిక ఆహారం పై శిక్షణ తరగతులు నిర్వహించాలని ఏ పీ యం బత్తుల మాణిక్యం అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో శుక్రవారం కిషోర బాలికల శిక్షణ కొరకు సంబంధించిన గ్రామ సమన్వయకర్తలకు శిక్షణ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం గ్రామస్థాయిలో కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు చేసి వారికి ఆరోగ్యము, పౌష్టిక ఆహారం పై శిక్షణలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో సీ సీలు మురళీ, సాయన్న, సరళ, లక్ష్మి, సునీత, మండల సమాఖ్య వివో ఏ లు తదితరులు పాల్కొన్నారు.

More articles

Latest article