30.9 C
Hyderabad
Monday, August 3, 2026

స్వచ్ఛత పరిశుభ్రత ఎక్కడ సార్లు..?

Must read

📰 Generate e-Paper Clip

. . . పరిశుభ్రతకు తూట్లు.. ఇదే మా అడ్డా..!

 

. . . పౌల్ట్రీ నిర్వాహకుల నిర్వాహకం

 

. . . కార్యాలయాల పక్కనే డంపింగ్ యార్డుల తలపిస్తున్న వైనం

 

. . . పట్టించుకోని అధికారులు

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండల కేంద్రంలోని మండల పరిధిలో గల కో-ఆపరేటివ్ బ్యాంక్, తహసీల్దార్ కార్యాలయం పక్కనే బైపాస్ రోడ్డుకు పౌల్ట్రీ వ్యర్థ పదార్థాలు, కుళ్ళిన మాంసాలు, చెత్తలను తీసుకువచ్చి వదిలేయడంతో డంపింగ్ యార్డుని తలపిస్తోంది. దీంతో ప్రయాణిక ప్రజలకు దుర్వాసన రావడంతో ప్రయాణం చేయాలంటే గగన తరంగా మారింది. గత మూడు సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులు లేక, అధికార యంత్రాంగం పట్టించుకోక ఈ దుస్థితి నెలకొందని ప్రయాణిక ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బైపాస్ రూటే డంపింగ్ యార్డుకు అడ్డాగా మారిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం పట్టించుకోని అట్టి స్థలం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించి ప్రయాణికులను రోగాల బారిన పడకుండా రక్షించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఏది ఏమైనా ఇప్పటికైనా పరిశుభ్రతకు నోచుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.

 

Where is the cleanliness and hygiene?
Where is the cleanliness and hygiene?
Where is the cleanliness and hygiene?
Where is the cleanliness and hygiene?

More articles

Latest article