26.7 C
Hyderabad

11వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా ట్రాన్స్ జండర్స్ కి అవకాశం ఇవ్వాలని దరఖాస్తు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుంచి 11వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిజామాబాద్ అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణకి ట్రాన్స్ జెండర్ జరీనా బేగం దరఖాస్తును సమర్పించారు. ఈ సందర్భంగా అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అవకాశం కల్పిస్తుందని అందులో భాగంగానే ముఖ్యమంత్రి కో ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పించాలని నిర్ణయించారన్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో నిజామాబాద్ అర్బన్ లో కార్పొరేటర్ గా అవకాశం కల్పించాలని ట్రాన్స్ జండర్ గా జరీనా బేగం దరఖాస్తు చేసుకున్నారని, ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్ అర్చన, ఆమల, కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్, టి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article