అకారణంగా యువకుడిని కొట్టిన సిఐపై చర్యలు తీసుకోవాలి

0 7,909

. . . సీపీని కలిసిన ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

అకారణంగా, ఎలాంటి కేసు లేకున్నా యువకుడిని తీవ్రంగా కొట్టిన ఆర్మూర్ సిఐ సత్యనారాయణపై ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సీపీ సాయిచైతన్యకు వినతి పత్రం సమర్పించారు. నిజామాబాద్ జిల్లాఆలూరు మండలంమచ్చర్ల గ్రామానికి చెందిన పచ్చుక రాజేశ్వర్ అనే మాదిగ యువకుడిపై అకారణంగా ఎటువంటి కేసు లేకుండా పోలీస్ స్టేషన్ లో ఒక రోజు ఉంచి తీవ్రంగా కొట్టారని సీపీకి ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 2తేదీ నుంచి ఇప్పటి వరకు జరిగిన విషయాలు అన్ని సీపీకి క్లుప్తంగా అన్ని విషయాలు వివరించారు. దీనిపై సీపీ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. సీపీని కలిసిన వారిలో ఎమ్మార్పీఎస్, జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ, ఎంఎస్ పీ,జిల్లా అధ్యక్షుడు సరికేల పోశెట్టి మాదిగ, ఎంఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు తెడ్డు గంగారాం మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ మదిగ, జిల్లా సీనియర్ నాయకులు గంధమల నాగభూషణ్ మాదిగ, ఎంఎంఎస్ జాతీయ నాయకులు పెద్దోళ్ల యమున మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి లాసిన్గారి భూమయ్యా మాదిగ, జిల్లా సీనియర్ నాయకులు తెడ్డు రవికిరణ్ మాదిగ, టౌన్ అధ్యక్షులు పెద్దిగారి మహేష్ మాదిగ, బాధితుడు పచ్చుక రాజేశ్వర్ మాదిగ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.