29 C
Hyderabad
Monday, August 3, 2026

స్నేహ సొసైటీలో గాంధీ, శాస్త్రీ జయంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్                                                                                                                                                               

నగరంలోని మారుతినగర్ లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్ స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో మహాత్మ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ మాజీ  చైర్మన్ విఠల్ రావు ముఖ్య అతిథిగా హాజరై చిత్రపటానికి పూలమాల వేసి  నివాళ్ళర్పించారు. ఈ సందర్భంగా విఠల్ రావు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరంలో ప్రధానభూమిక పోశించి అహింస మార్గంలో భారతదేశానికి స్వాతంత్ర్యం సంపాదించిన మహాత్ముడు గాంధీ అని అన్నారు. అలాగే భారతదేశ రెండవ ప్రధానమంత్రి అయిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని కూడా  జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు.  ఆ మహానుభావుల పుట్టిన రోజుల నాడే నా జన్మదిన వేడుకలు దివ్యాంగుల మధ్య  జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా విఠల్ రావు కేక్ కట్ చేసి దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు రమణరావు, మాజీ  పబ్లిక్ ప్రాసిక్యూటర్ మధుసుదన్ రావు, తెలంగాణ శంకర్, అమరేందర్ రావు, శేఖర్ రాజు, జీవన్ రావు, అంజయ్య, మనోహర్ రావు, స్నేహ  సొసైటీ కార్యదర్శి సిద్దయ్య,  ప్రిన్సిపాల్  జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి, మానసిక వికలాంగ విద్యార్థులు, అంధ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article