25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

అర్ధరాత్రి హల్ చల్

Must read

📰 Generate e-Paper Clip

…దొంగలునే అనుమానంతో పట్టుకొని పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు 

 

కోటగిరి, బతుకమ్మ : 

 పోతంగల్ మండల కేంద్రంలోనీ హంగార్గ గ్రామం వద్ద బుధవారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు నాలుగు స్కార్పియో వాహనాలలో అనుమానస్పదంగా కనిపించడంతో గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం.. బుధవారం రాత్రి సమయంలో మహారాష్ట్రకు చెందిన కొందరు నాలుగు వాహనాలలో అనుమానాస్పదంగా తిరుగుతుండడానికి గమనించిన హంగర్గ గ్రామానికి చెందిన కొందరు యువకులు దొంగలుగా భావించడంతో ఫోటోలు వీడియోలు తీసే ప్రయత్నం చేయగా ఫోటోలు వీడియోలు తీస్తున్న వ్యక్తులను గమనించిన వాహనదారులు యువకులను వెంబడించారు. వెంటనే అప్రమత్తమైన యువకులు గ్రామస్తులకు సమాచారం అందించగా గ్రామస్తులు రెండు వాహనాలను పట్టుకొని పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు.

More articles

Latest article