జిల్లా పంచాయతీ అదికారికి ఈ పంచాయతీ ఆపరేటర్ల వినతి

0 9,869

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లాలోనీ అన్ని మండలాలలో పనిచేస్తున్న ఈ పంచాయతీ ఆపరేటర్లకు పెండింగ్లో ఉన్న మూడు నెలల జీతాలు చెల్లించాలని, ప్రత్యేక జీవో ద్వారా ప్రతినెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని ఇన్చార్జి జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు పి కోరారు. మంగళవారం ఈ మేరకు ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఇంచార్జీ డిపిఓ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అలాగే అధిక పని ఒత్తిడిని తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్, కోశాధికారి సతీష్, నాయకులు శ్రీనివాస్, శేఖర్, మోహన్, సునీల్, లింబాద్రి, కల్పనా, మమత, సుజాత తదితరులు ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.