27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎల్లారెడ్డిలో బంద్ ప్రశాంతం

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ :  ఎల్లారెడ్డిలో శుక్రవారం ఉదయం 9.30 గంటలకు  మిత్ర పక్షాల బంద్ ప్రారంభమైంది.  ఈమేరకు పట్టణంలోని అన్ని దుకాణదారులు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి నిరసనలో పాల్గొన్నారు. పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అలాగే పట్టణంలోని ప్రైవేట్ విద్యాసంస్థలు, పాఠశాలలు బంద్‌ కి సహకరించాయి. ప్రభుత్వ పాఠశాలలను కూడా మిత్ర పక్షాల నాయకులు వెళ్లి బంద్ చేయించినట్లు సమాచారం. పట్టణంలో ఎక్కడా ఉద్రిక్తతలు లేకుండా, మొత్తం పరిస్థితి ప్రశాంతంగా ఉంది.  పోలీసులు పరిస్థితిని నిఘాలో ఉంచారు. కాగా, సోమార్ పేట ఘటన ను వ్యతిరేకిస్తూ మిత్ర పక్షాలు గురువారం ఎల్లారెడ్డి బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

Bandh Prashant in Yella Reddy

 

More articles

Latest article