28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆల్ ఇండియా లక్షద్వీప్ ఎన్ సీసీ క్యాంప్ కి ఎంపికైన వైష్ణవి కి సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

 

భిక్కనూరు, బతుకమ్మ :

ఎన్ సీసీ ఆలిండియా లక్షద్వీప్ క్యాంప్ కి  ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి  ఎంపికైన 11 మందిలో బిక్కునూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి ని ఆదివారం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఉదయ్ శర్మ సన్మానించారు. తన వార్డుకు సంబంధించిన  విద్యార్థి ఆల్ ఇండియా లక్షద్వీప్ క్యాంప్ కి సెలెక్ట్ అవ్వడం వార్డు కే కాదు గ్రామానికి ఎంతో గర్వకారణం అన్నారు నేటి యువతులకు తను ఒక ఆదర్శం అని ఆయన పేర్కొన్నారు.ఈ సన్మాన కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ మద్ది స్వామి, మాజీ సర్పంచ్ సిద్ధరాములు, మాజీ ఉపసర్పంచ్ మల్లేశం,  నారాయణ, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గౌరీ గారి రాజిరెడ్డి,,నారాయణ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article