. . . ఓకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం
. . . మృతులు నిజాం సాగర్ వాసులు
. . . ఓటు వేసేందుకు సొంతూరు వస్తుండగా ప్రమాదం
మెదక్, బతుకమ్మ :
జాతీయ రహదారి 161 పై శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెదక్ జిల్లా శంకరం పేట మండల కేంద్రం శివారులో జాతీయ రహదారిపై కింగ్స్ 9 దాబా వద్ద బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడి కక్కడే మృతి చెందారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగీకి చెందిన కురుమ లింగమయ్య (45) అతని భార్య సాయవ్వ( 40), కొడుకు సాయి (18) కుతూరు మానస(8) లు హైదరాబాద్ నుంచి మాగీకి బైక్ పై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లింగమయ్య హైద్రబాద్ లో ఉంటు కుటుంబాన్ని పోషించుకుటుండుంగా అదివారం గ్రామంలొ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు భార్య పిల్లలతో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడటంతో మాగీ గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి.
