25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

బోధన్ డివిజన్ లో సత్తా చాటిన బీసీలు

Must read

📰 Generate e-Paper Clip

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :  బోధన్ డివిజన్ లో బీసీ బిడ్డలు సత్తా చారని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. అలాగే నిజామాబాద్ డివిజన్ లో బీసీ అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.  బీసీ జేఏసీ సిరికొండ అధ్యక్షులు బండారి నరేష్ ఆధ్వర్యంలో  సిరికొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరాల సుధాకర్ తోపాటు రాష్ట్ర యువజన కార్యదర్శి కొయ్యాడ శంకర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడారు. ఇదే ఐకమత్యం కొనసాగితే భవిష్యత్తులో బీసీలదే రాజ్యాధికారం అన్నారు.   సింహభాగం పంచాయతీలను గెలుచుకుంటే బీసీ ద్రోహులకు గుణపాఠం చెప్పిన వాళ్లమవుతామన్నారు.  భవిష్యత్తులో  దామాషా ప్రకారం రిజర్వేషన్లు దక్కాలంటే ఈ పంచాయతీ ఎన్నికల్లో  ప్రభావం చూపాలన్నారు. సెంటిమెంట్లకు, ఆర్థిక బలానికి, ఎమోషన్స్ మనోభావాలకు, ప్రలోభాలకు లొంగకుండా బీసీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.  ఈసమావేశంలో చింతకుంట రామస్వామి, బాలాజి, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article