24 C
Hyderabad
Sunday, August 2, 2026

సమస్యల పరిష్కారానికి రిజిస్ట్రార్ కు  ఎన్ఎస్యూఐ వినతి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎన్ఎస్యూఐ వర్సిటీ అధ్యక్షుడు బాణోత్ సాగర్ నాయక్ నేతృత్వంలో మంగళవారం వర్సిటీ రిజిస్ట్రార్ ప్రో.యాదగిరి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనివర్శిటీ హాస్టల్ గదుల్లో ఫ్యాన్ లు, కిటికీలకు మేష్ లతో పాటు హాస్టల్ పరిసర ప్రాంతాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రాత్రిపూట వీధి దీపాలు వెలగడం లేదని, దీంతో విద్యార్థులు రాత్రి వేళల్లో లైబ్రరీ వెళ్ళాలంటే ఇబ్బందులు పడుతున్నారన్నారు. తాగునీరు సైతం ఫిల్టర్ కావడం లేదని, సంబంధిత సిబ్బందితో నీటి పరీక్షలు సైతం చేయించాలని కోరారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి రిజిస్ట్రార్ సానుకూలంగా స్పందించారని నాయకులు తెలిపారు.రిజిస్ట్రార్ ను కలిసిన వారిలో ఎన్ఎస్యూఐ వర్సిటీ ఉపాధ్యక్షుడు హరీష్, సందీప్, రాజేంద్ర ప్రసాద్, దేవేందర్, చందర్ రాథోడ్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article