వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణలో తొలి విడత పంచాయతీ పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగింది. 1:00 లోపు క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. 37,562 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాల అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు చేపడతారు.
