25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

విధులకు ఆటంకం ముగ్గురిపై కేసు నమోదు 

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :  ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఒకటో టౌన్ ఎస్సై బుధవారం తెలిపారు. వివరాలు.. ఈనెల 9న ఆర్ఐ వినోద్, రిజర్వ్ ఇన్ స్పెక్టర్,  తన సిబ్బందితో కలిసి డ్రంక్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. ఈక్రమంలో మహారాష్ట్రకు చెందిన ముగ్గరు వ్యక్తులు కారులో వచ్చారు. సంబంధింత కారును తనిఖీ చేస్తుండగా ఆర్ఐ వినోద్, రిజర్వ్ ఇన్ స్పెక్టర్,  సిబ్బందిని దుర్భాషలాడుతూ వారి విధులకు ఆటంకపరిచారు. అలాగే కారును తనిఖీ చేయగా అందులో మూడు గ్రాముల గంజాయి లభ్యమైంది. ఆర్ఐ ఫిర్యాదు మేరకు ముగ్గురిపై  కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.  అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈసందర్భంగా  ఎస్సై హెచ్చరించారు.

More articles

Latest article